నెటిజన్లకు షాక్: నిలిచిపోయిన ఫేస్‌బుక్ సేవలు

by Gantepaka Srikanth |

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebock), మెసెంజర్ (Messenger) యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా మూగబోయాయి.

నెటిజన్లకు షాక్: నిలిచిపోయిన ఫేస్‌బుక్ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebock), మెసెంజర్ (Messenger) యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా మూగబోయాయి. సాంకేతిక లోపం కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ఫేస్బుక్ ఖాతాలను ఓపెన్ చేయలేక, అలాగే మెసెంజర్‌లో సందేశాలు పంపలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ స్క్రీన్లపై "Query Error" (క్వెరీ ఎర్డర్) లేదా "Please check your internet connection" అని కనిపిస్తుండటంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఫేస్బుక్, మెసెంజర్ సేవలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాదాపు 70 శాతానికి పైగా వినియోగదారులు యాప్ అసలు ఓపెన్ కావడం లేదని ఫిర్యాదు చేయగా, మిగిలిన వారు సర్వర్డ్ కనెక్షన్ లోపాలు, వెబ్సైట్ లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. మొబైల్ యాప్లతో పాటు డెస్క్‌టాప్ వెర్షన్లలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా యూజర్ల హడావుడి..

ఫేస్బుక్, మెసెంజర్లో సాంకేతిక అంతరాయం తలెత్తడంతో నెటిజన్లంతా ఒక్కసారిగా 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)కు క్యూ కట్టారు. దీంతో ఎక్స్ ప్లాట్ఫామ్ #FacebookDown, #MessengerDown, Query Error అనే హ్యాష్ ట్యాగ్లు క్షణాల్లో టాప్ ట్రెండింగ్లో కి వచ్చాయి. “నా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా బాగుంది. కానీ ఫేస్బుక్ మాత్రం క్వెరీ ఎర్రర్ అని చూపిస్తోంది. మొదట నా అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందేమో అని భయపడ్డాను" అని ఒక యూజర్ పోస్ట్ చేయగా.. "మెస్టెంజర్లో అర్జెంట్ మెసేజ్ పంపాలి, కానీ సర్వర్ రెస్పాండ్ అవ్వడం లేదు” అంటూ మరికొందరు స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ 'మెటా' యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ సాంకేతిక అంతరాయంపై మెటా నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పష్టత రాలేదు. ఈ సమస్య కేవలం కొన్ని దేశాలకే పరిమితమైందా లేక అంతర్జాతీయంగా అందరికీ వస్తోందా అనే దానిపై సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా సర్వర్ మెయింటెనెన్స్ లేదా బ్యాక్ ఎండ్ అప్డేట్ల (Back-end Updates) సమయంలో ఇలాంటి లోపాలు జరుగుతుంటాయని, కాబట్టి కొద్దిసేపట్లోనే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story