- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్‌వాడీల్లో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి: కేంద్రం
అంగన్వాడీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీకి జూలై 1వ తేదీ నుండి లబ్ధి దారుల ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అంగన్వాడీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీకి జూలై 1వ తేదీ నుండి లబ్ధి దారుల ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పోషణ ట్రాకర్‌లో ఫేస్ రికగ్నిషన్ ఆధారిత సేవలు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 30 నుండి లబ్ధిదారుల ప్రొఫైల్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. దీంతో ఇకపై ఫోటో క్యాప్చరింగ్‌తో పాటు ఈకేవైసీ తప్పనిసరి అవుతుంది.
ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే అంగన్వాడీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. స్కూల్‌లో ఉన్న పిల్లలకు సరిపడా పౌష్ఠికాహారం సరఫరా చేసినప్పుడు వాళ్లు తీసుకోకపోవడంతో అమ్మేసి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అలాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉంది.






