ఎయిరిండియా బ్లాక్ బాక్స్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ పూర్తి.. విశ్లేషణ షురూ!

by Phanindra |

ఎయిరిండియా బ్లాక్ బాక్స్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం డేటా విశ్లేషణ జరుగుతోంది.

ఎయిరిండియా బ్లాక్ బాక్స్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ పూర్తి.. విశ్లేషణ షురూ!
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో సేకరించిన బ్లాక్ బాక్స్‌ల నుంచి డేటా ఎక్స్‌ట్రాక్ట్ చేయడం పూర్తయిందని, ప్రస్తుతం ఈ డేటా అనాలసిస్ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 24వ తేదీన రెండు ఐఏఎఫ్ విమానాల్లో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్)ను ఢిల్లీకి తీసుకొచ్చినట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెల్లడించింది.

అదే రోజున డేటా ఎక్స్‌ట్రాక్షన్ మొదలైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు ఏఏఐబీ డీజీ నేతృత్వంలో ఏఏఐబీ టెక్నికల్ టీం, యూఎస్ ఎన్‌టీఎస్‌బీ, ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్టు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ (ఏటీసీ)తో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందమే డేటా ఎక్స్‌ట్రాక్ట్ చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 25 నాటికి డేటా అంతా ఎక్స్‌ట్రాక్ట్ చేశామని, ప్రస్తుతం దీని అనాలసిస్ జరుగుతోందని వెల్లడించింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆపే అవకాశం ఉంటుందని కేంద్ర పేర్కొంది.

Next Story