Extort Money: లారెన్స్ బిష్ణోయ్‌ పేరు చెప్పి బిహార్ మంత్రికి వార్నింగ్.. యూపీకి చెందిన వ్యక్తి అరెస్టు

by B.Srinivas |

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బిహార్ మంత్రిని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Extort Money: లారెన్స్ బిష్ణోయ్‌ పేరు చెప్పి బిహార్ మంత్రికి వార్నింగ్.. యూపీకి చెందిన వ్యక్తి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrance Bishnoi) పేరుతో బిహార్ మంత్రిని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బిహార్ కార్మిక వనరుల శాఖ మంత్రి సంతోష్ కుమార్ సింగ్‌ (Santhosh kumar singh)కు ఫోన్ చేసి లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరించాడు. వెంటనే రూ.30 లక్షలు ఇవ్వాలని లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. ఈ విషయంపై మంత్రి సంతోష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే యూపీ నుంచి ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఓ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను పాట్నాకు తీసుకొచ్చారు. అయితే అరెస్టైన నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. దీనిపై మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story