- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగమ్ ఖలీదా జియా కి నివాళులర్పించిన విదేశాంగ మంత్రి జైశంకర్
బంగ్లాదేశ్ రాజకీయ దిగ్గజం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వయంగా ఢాకాకు చేరుకుని, భారత ప్రభుత్వం మరియు ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బిఎన్‌పి (BNP) అధినేత్రి బేగమ్ ఖలీదా జియా మరణం ఆ దేశంతో పాటు యావత్ దక్షిణ ఆసియాను విషాదంలో ముంచెత్తింది. 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన ఆమె అంత్యక్రియలు బుధవారం ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం వద్ద పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వయంగా ఢాకాకు చేరుకుని, భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఖలీదా జియా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ సమాధి చెంతనే ఆమె పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు.
ఖలీదా జియా అంత్యక్రియలకు భారత దేశంతో పాటు పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక వంటి పొరుగు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించగా, బుధవారం ఒక రోజు బహిరంగ సెలవు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆమె మృతికి సంతాపం తెలుపుతూ, 2015లో ఆమెతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఆమె పోషించిన కీలక పాత్రను స్మరించుకుంటూ నివాళులర్పించాయి.






