బెంగళూరు బస్టాండ్‌లో పేలుడు పదార్థాల కలకలం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-23 15:37:42  IST  )

బెంగళూరు బస్టాండ్ వద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.

బెంగళూరు బస్టాండ్‌లో పేలుడు పదార్థాల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు బస్టాండ్ (Bengaluru Bus Stand) వద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. కలాసిపాళ్యం బస్టాండ్ టాయిలెట్ సమీపంలో ఒక ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాలను గుర్తించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆ బ్యాగులో 6 జెలాటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఉన్నాయి. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు, షాపుల నిర్వాహకులను బయటకు పంపి.. బాంబ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు నిర్వహించామని, ఇంకా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బెంగళూరు పోలీస్ ఉన్నతాధికారి ఎస్. గిరీశ్ మీడియాకు తెలిపారు. బెంగళూరు నుంచి తమిళనాడులో హోసూరు, కృష్ణగిరి ప్రాంతాల్లోని క్వారీల్లో బండల్ని పగలగొట్టేందుకు వీటిని తీసుకెళ్తూ వదిలేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లేదంటే దీని వెనుక ఉగ్రకోణం ఉందా అని కూడా అనుమానిస్తున్నారు.

Next Story