- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రకోట వద్ద పేలుడు: కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక
ఎర్రకోట వద్ద పేలుడు: కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం కేంద్ర హోంశాఖకు సమర్పించారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో ఫరీదాబాద్ డాక్టర్లకు సంబంధాలపై నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు.. ఫరీదాబాద్‌లో పెద్దఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనం వెనుక భారీ నెట్‌వర్క్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫరీదాబాద్‌లోని యూనివర్సిటీకి చెందిన వారి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇప్పటికే ఆ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలపై విచారిస్తున్నారు. స్లీపర్ సెల్స్‌గా ఎవరైనా పనిచేశారా?, ఇటీవల భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే విషయాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. సంప్రదింపుల కోసం ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇతర సభ్యులు, నెట్‌వర్క్ వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.






