- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana: మాకు తాగు నీరు ఇవ్వండి.. లేదంటే పాక్ కు అదనపు జలాలు వెళ్తాయి
పంజాబ్- హర్యానా మధ్య నీటి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. బాక్రా రిజర్వాయర్ లో అదనంగా మిగిలిన తాగునీటికి తమకు ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం పంజాబ్ ని కోరింది.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్- హర్యానా మధ్య నీటి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. బాక్రా రిజర్వాయర్ లో అదనంగా మిగిలిన తాగునీటికి తమకు ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం పంజాబ్ ని కోరింది. లేదంటే ఆ నీరు పాకిస్థాన్ కు వెళ్లడం తప్ప మరో ప్రయోజనం లేదన పేర్కొంది. భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రకటన విడుదల చేశారు. ‘‘జూన్ నాటికి బాక్రానంగల్ ఆనకట్టను ఖాళీ చేయడం అవసరం. అప్పుడే వర్షాకాలంలో నదీ జలాలను నిల్వ చేసుకోవచ్చు. రిజర్వాయర్‌లో అప్పుడు నీరు లేకపోతే.. అదనపు జలాలు హరి-కె-పట్టాన్ నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోతాయి. అది అటు పంజాబ్.. ఇటు హర్యానాకు ఉపయోగపడదు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పడు నీటి విడుదలకు పంజాబ్ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ప్రస్తుతం అక్కడ ఆప్ ప్రభుత్వం లేదు. అలాంటి సమయంలో ఢిల్లీ ప్రజలను శిక్షించేలా అలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అసలు హర్యానాకు రావాల్సిన వాటా జలాలే అందుబాటులోకి రాలేదు. గత నెల బాక్రా బేస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన నీటిలో పంజాబ్‌కు 400, రాజస్థాన్‌కు 800, ఢిల్లీకి 500 క్యూసెక్కులు పోగా హర్యానాకు మిగిలింది కేవలం 6,800 క్యూసెక్కులు మాత్రమే. ఇక న్యాయంగా హర్యానాకు రావాల్సిన వాటా ఇచ్చినా.. అది బాక్రా ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటిలో 0.0001 శాతానికి సమానం’’ అని నాయబ్ సింగ్ సైనీ పేర్కొన్నారు.
బీజేపీపై మాన్ ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వం చీనాబ్, జీలమ్ సహా ఇతర నదుల నీటిని ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు మళ్లించాలని సైనీ కోరారు. ప్రస్తుతం భాక్రానంగల్ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నీటి అవసరాలను తీరుస్తోంది. మరోవైపు, హర్యానా డిమాండ్‌ను తీర్చడానికి బీబీఎంబీ ద్వారా పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. కేటాయించిన నీటి వాటాలో హర్యానా ఇప్పటికే 103 శాతం వాడుకుందని పేర్కొన్నారు. ఇకపోతే, సింధూ జలాల ఒప్పందం పరిధిలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం.






