- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prashant Kishor: బిహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. పీకే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం జరిగింది. జన్ సురాజ్ పార్టీలో కేంద్ర మాజీమంత్రి ఆర్పీ సింగ్ చేరారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం జరిగింది. జన్ సురాజ్ పార్టీలో కేంద్ర మాజీమంత్రి ఆర్సీపీ సింగ్ చేరారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సమక్షంలో ఆర్సీపీ సింగ్ జన్ సూరాజ్ పార్టీలో చేరారు. అంతేకాకుండా, తన 'ఆప్ సబ్కీ ఆవాజ్' పార్టీని జన్ సూరాజ్ పార్టీతో విలీనం చేస్తున్నట్లు సింగ్ ప్రకటించారు. "బిహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి మేమిద్దరం కలిసి పని చేస్తాము" అని ఆర్సీపీ సింగ్ చెప్పుకొచ్చారు.
మాజీ ఐఏఎస్ అధికారి..
ఇకపోతే, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వస్థలం నలందకు చెందిన ఆర్సీపీ సింగ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 1999లో జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. 2005లో బిహార్‌లో అధికారం చేపట్టిన తర్వాత నితీశ్ కుమార్ ఆర్సీపీ సింగ్ ని బిహార్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇకపోతే, నితీశ్ తో ఉన్న సన్నిహిత్యంతో 2010లో సింగ్ పదవికి స్వచ్ఛంద విరమణ చేసి జేడీయూలో చేరారు. ఆ తర్వాత రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్పీ సింగ్ జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, 2021లో కేంద్ర మంత్రివర్గంలోకి ఆర్సీపీ సింగ్ చేరిన తర్వాత నితీశ్ తో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత, ఆయన జేడీ(యూ)ని విడిచిపెట్టి 2023లో బీజేపీలో చేరారు. కొన్నిరోజుల తర్వాత కాషాయపార్టీ నుంచి బయటకొచ్చి ఆప్ సబ్కీ ఆవాజ్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని జన్ సురాజ్ పార్టీలో విలీనం చేశారు.






