Samosa Party : సీఎం వర్సెస్ మాజీ సీఎం.. ఎగతాళి చేస్తూ సమోసా పార్టీ

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ‘సమోసా’ పాలిటిక్స్‌తో హిమాచల్‌(Himachal Pradesh) హీటెక్కింది.

Samosa Party : సీఎం వర్సెస్ మాజీ సీఎం.. ఎగతాళి చేస్తూ సమోసా పార్టీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘సమోసా’ పాలిటిక్స్‌తో హిమాచల్‌(Himachal Pradesh) హీటెక్కింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Sukhu)కు అందాల్సిన సమోసాలు.. ఆయన భద్రతా సిబ్బందికి చేరడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. సమోసాలనే కాపాడలేని వాళ్లు, రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారని ప్రశ్నిస్తోంది.

అక్టోబరు 21న జరిగిన సీఎం సుఖు సమోసా ఎపిసోడ్‌(Samosa Party)ను ఎగతాళి చేస్తూ హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత జైరాం ఠాకూర్ సమోసాలతో స్పెషల్ అల్పాహార విందును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జైరాం ఠాకూర్ సహా బీజేపీ నేతలంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, రుచిని ఆస్వాదిస్తూ సమోసాలను ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story