Delhi: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-16 02:46:50  IST  )

ఢిల్లీ రైల్వే స్టేషన్‌(Delhi Railway Station)లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Delhi: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ రైల్వే స్టేషన్‌(Delhi Railway Station)లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) సహా ప్రధాని మోడీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ(Department of Railways) ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మైనర్ గాయాలైన వారికి రూ.లక్ష ప్రకటించింది. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Railway Minister Ashwini Vaishnav) తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. మృతులంతా ఢిల్లీ, బిహార్ వారిగా అధికారులు గుర్తించారు.

మృతులు: ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతా మాలిక్, రియా సింగ్, బేబి కుమారి, మనోజ్, మమతాఝా

Next Story