Trump: ట్రంప్ ని చంపేస్తానని ఎఫ్ బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు

by Shamantha N |   (  Updated:2025-05-16 06:30:39  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీ (James Comey) బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Trump: ట్రంప్ ని చంపేస్తానని ఎఫ్ బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీ (James Comey) బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతడి చర్యలపై అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్‌ వెల్లడించారు. జేమ్స్‌ కామీ ‘86 47’ అనే పదాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి, డిలీట్‌ చేశారని.. 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్‌ ఉందని అధికారులు తెలిపారు. "FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ని హత్య చేచయాలని పిలుపునిచ్చారు" అని నోయెమ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

స్పందించిన జేమ్స్ కామీ

ఈ విషయంపై జేమ్స్‌ కామీ స్పందిస్తూ.. తాను బీచ్‌వాక్‌ చేస్తున్న సమయంలో చూసిన షెల్‌ల చిత్రాన్ని పోస్ట్‌ చేశానని..ఆ పోస్ట్‌ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ నంబర్లను కొందరు హత్యలు చేసేందుకు వాడుతారనే విషయం తనకు తెలియదని అన్నారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని.. హింస అంటేనే తనకు నచ్చదని అన్నారు. ఆ పోస్ట్‌ వల్ల తనపై అసంబద్ధమైన ఆరోపణలు వస్తుండడంతో దానిని డిలీట్‌ చేశానని తెలిపారు. కాగా.. గతేడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన చెవికి గాయమైంది. ఆ తర్వాత కూడా అతడిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి.

Next Story