Jaishankar: పెంచి పోషించి ఉగ్రవాదానికి మూల్యం చెల్లించుకుంటున్న పాక్

by Shamantha N |

పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ (Pakistan) మూల్యం చెల్లించుకుంటోంది భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ (S Jaishankar) విమర్శించారు.

Jaishankar: పెంచి పోషించి ఉగ్రవాదానికి మూల్యం చెల్లించుకుంటున్న పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ (Pakistan) మూల్యం చెల్లించుకుంటోంది భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ (S Jaishankar) విమర్శించారు. న్యూస్‌18 రైజింగ్‌ భారత్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్ మాట్లాడుతూ పాక్ పై నిప్పులు చెరిగారు.భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని పాకిస్థాన్ ప్రజలే బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారని మండిపడ్డారు. జైశంకర్ మాట్లాడుతూ..‘ఇదంతా కన్పిస్తూనే ఉంది. వారే చెప్తున్నారు కూడా. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని బహిరంగంగా ప్రకటించే వ్యక్తులు పాకిస్థాన్‌లో ఉన్నారు. వారే గర్వంగా.. బాహాటంగా ఈ విషయాన్ని చెప్తున్నారు. మీరొక టెర్రరిజం ఇండస్ట్రీని ప్రారంభిస్తే.. అదే మిమ్మల్ని దెబ్బతీస్తుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు జరిగిందదే. పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాక్ మూల్యం చెల్లించుకుంటోంది. నేను మీతో ఉదయం మంచిగా ఉండి.. రాత్రికి మీ ఇంటిపై వచ్చి దాడి చేస్తే మీకు ఓకేనా..? అలాంటివారితో కలిసి ఉంటారా..?’’ అని విదేశాంగమంత్రి (S Jaishankar) ప్రశ్నించారు.

రాణా అప్పగింతపై

ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి తహవూర్‌ రాణా అప్పగింతపై జైశంకర్ స్పందించారు. ‘‘ఈ అంశంలో కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. అమెరికా కోర్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’’ అని తెలిపారు. కాగా.. గత కొన్నిరోజులుగా పాక్, బలోచిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.బ లోచిస్తాన్ అస్థిరతపై మాట్లాడేందుకు నిరాకరించారు. "బలూచిస్థాన్‌లో గందరగోళ పరిస్థితి ఉంది. ప్రజలు బాధపడుతున్నారు. నేను ఏదైనా చెబితే.. ఆ ప్రాంత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టినట్లు అవుతోంది. అందుకే, నేను ఏమీ చెప్పాలనుకోవడం లేదు" అని ఆయన అన్నారు.

Next Story