పది జన్మలెత్తినా ఫాల్తాలో నన్ను ఓడించలేరు.. బీజేపీకి అభిషేక్ బెనర్జీ సంచలన సవాల్

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్‌లో కౌంటింగ్‌ ఒక్కరోజు ముందు టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీజేపీకి సంచలన సవాల్ విసిరారు.

పది జన్మలెత్తినా ఫాల్తాలో నన్ను ఓడించలేరు.. బీజేపీకి అభిషేక్ బెనర్జీ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌‌లోని ఫాల్తా (Falta) నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అధికార టీఎంసీ (TMC), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదం, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత నియోజకవర్గం ‘ఫాల్తా’ నుంచి పోటీ చేసి తనను ఓడించాలని బీజేపీ నేతలకు అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. పది జన్మలెత్తినా అక్కడ తనను ఓడించడం బీజేపీ వల్ల కాదని ధీమా వ్యక్తం చేశారు.

ఈవీఎంల పనితీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ఆయన స్పందిస్తూ.. యంత్రాలను ట్యాంపరింగ్ చేసినా జనం ఇచ్చే తీర్పును మార్చలేరని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని టీఎంసీని అణచివేయాలని బీజేపీ చూస్తోందని, కానీ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ (Mamata Banerjee) వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని, బీజేపీ కేవలం మతపరమైన రాజకీయాలు, తప్పుడు ప్రచారాలపై ఆధారపడుతోందని అభిషేక్ బెనర్జీ ఫైర్ అయ్యారు.

Next Story