- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరినా.. రష్యా ఆయిల్‌పై తీరని అనుమానాలు..
యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరినా.. రష్యా ఆయిల్‌పై అనుమానాలు తీరడంలేదు. ఈ విషయంపై భారత్ స్పష్టత ఇవ్వలేదు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గించిన యూఎస్.. ఒక సంచలన ప్రకటన చేసింది. రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై అదనంగా వేసిన 25 శాతం సుంకాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఈ ఆదేశాల్లో రష్యా చమురుపై భారత్ చర్యలను కూడా ప్రస్తావించారు. ‘రష్యా నుంచి నేరుగా కానీ, పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చింది. అదే సమయంలో యూఎస్ నుంచి ఎనర్జీ ఉత్పత్తులు కొంటామన్నది. వచ్చే పదేళ్లలో యూఎస్‌తో రక్షణ రంగంలో కూడా సహకారం పెంచుకునే ఫ్రేమ్‌వర్క్‌కు ఒప్పుకుంది’ అని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో అమెరికా పేర్కొంది. అయితే మధ్యంతర ట్రేడ్ డీల్‌పై జాయింట్ ప్రకటనలో రెండు దేశాలు రష్యా చమురు అంశాన్ని అసలు ప్రస్తావించలేదు. కేవలం అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు కొంటామని భారత్ ఒప్పుకుందని మాత్రమే ఈ డీల్‌లో ఉన్నది.
ఈ అంశంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను ప్రశ్నించగా.. రష్యా చమురు అంశం విదేశాంగ శాఖకు తెలుస్తుందని, ఈ డీల్ గురించి మాత్రమే తాను మాట్లాడుతానని చెప్పారు. అయితే ఇటీవల వాషింగ్టన్ పర్యటన ముగించుకున్న నేపథ్యంలో ట్రేడ్ డీల్ గురించి జైశంకర్‌ను ప్రశ్నించగా.. ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అంశాలూ గోయల్‌కే తెలుసునని ఆయన చెప్పారు. ఇద్దరు నేతలు ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. అదే సమయంలో ఎనర్జీ రంగం విషయంలో ఏదో ఒక దేశంపై ఆధారపడటం కుదరదని, పలుదేశాలతో డీల్స్ చేసుకుంటూ సప్లయ్ మార్గాలను డైవర్సిఫై చేసుకోవడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనడం ఆపలేదని అమెరికా మరోసారి సుంకాలు వేస్తుందా? లేక సుంకాల భయంతో భారత్ ఈ చమురు కొనుగోలు ఆపేస్తుందా? అనే ప్రశ్నలకు మరికొన్ని రోజులైతేనే సమాధానాలు దొరికేలా ఉన్నాయి.






