- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్‌తో కీలక ట్రేడ్ డీల్.. 15 శాతం సుంకాలకు ఈయూ అంగీకారం
ఈయూ, యూఎస్ మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. 15 శాతం యూఎస్ సుంకాలకు ఈయూ అంగీకారం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లేయన్, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలకమైన ట్రేడ్ డీల్ జరిగింది. యూరప్ నుంచి వచ్చే దిగుమతులపై 15 శాతం సుంకాలు విధించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టు 1లోగా యూరప్, యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగకపోతే 30 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ కొన్నిరోజుల క్రితం హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తాజాగా దీన్ని 15 శాతానికి తగ్గించుకొని యూరోపియన్ యూనియన్, యూఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌క్రాప్ట్ విడిభాగాలు, కెమికల్స్, సెమీకండక్టర్ సామగ్రి వంటి కొన్ని వ్యూహాత్మక వస్తువులపై సుంకాలు వేయకూడదని ఇరుదేశాలు అంగీకరించినట్లు ఉర్సులా తెలిపారు. ఈ లిస్టులో మరికొన్ని వస్తువులు జతచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అలాగే యూఎస్ నుంచి ఈయూ ఏకంగా 750 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు, ఆయిల్, న్యూక్లియర్ ఇంధనం కొనుగోలు చేయనుంది. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, యూఎస్‌లో అదనంగా 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా తాము అంగీకరించినట్లు ఉర్సులా తెలియజేశారు.






