LPG‍ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా యాక్ట్

by Prasad Jukanti |   (  Updated:2026-03-10 06:59:06  IST  )

ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ నిల్వలు తగ్గకుండా కేంద్రం కీలక చర్యలు తీసుకుంది.

LPG‍ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా  యాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ వార్ ఎఫెక్ట్ (Iran war impact) ఇండియాలోని ఎల్పీజీ వినియోగదారుల్లో (LPG supply India) ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశీయంగా ఉన్న గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా (ESMA - Essential Services Maintenance Act) చట్టాన్ని ప్రయోగించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధ్యాన్యం ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది.

ఆందోళనబాటలో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు:
ఇక యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో ఆ ప్రభావం దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆయా ఫ్యాక్టరీలపై పడుతోంది. హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హోటళ్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా చెన్నై హోటళ్ల అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను సైతం రాసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎల్పీజీ కొరత కారణంగా రెస్టారెంట్లు మరియు ఆహార పరిశ్రమల్లో ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల చెన్నై నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆందోళనబాటలో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు:

ఆహార పరిశ్రమ నిరంతరం ప్రజలకు సేవ అందించే రంగం అని ఈ రంగం ద్వారా అనేక ఆసుపత్రులు, ఐటీ పార్కులు, కాలేజ్ హాస్టళ్లలోని విద్యార్థులు, రైలు ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులకు సమయానికి ఆహారం అందించాల్సి ఉంటుంది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా అంతరాయం కలిగితే వీరందరూ తీవ్రంగా ప్రభావితమవుతారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్ బుకింగ్స్ తీసుకున్నాయని ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోతే అవి కూడా ప్రభావితమవుతాయని, ఎల్పీజీ కొరత వల్ల తమిళనాడులో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆహార సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆయిల్ పరిశ్రమలకు సంబంధించిన సంబంధిత అధికారులతో మాట్లాడి ఎల్పీజీని అత్యవసర సేవగా పరిగణించి, ఆహార పరిశ్రమకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story