- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ERASR: సముద్ర సరిహద్దుల్లో స్వదేశీ శక్తి.. ‘ఈఆర్ఏఎస్ఆర్’ ట్రయల్స్ సక్సెస్ !
భారత నావికాదళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లు మరో విజయాన్ని సాధించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లు మరో విజయాన్ని సాధించాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ (ఈఆర్ఏఎస్ఆర్) ను సక్సెస్ ఫుల్‌గా పరీక్షించాయి. ఐఎన్ఎస్ కవరత్తిలో జూన్ 23 నుంచి జూలై 07 వరకు ఈ ట్రయల్స్ నిర్వహించగా అవి పూర్తి విజయవంతం అయినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారత నావికాదళం టేకింగ్ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ఈ పరీక్షలో భాగస్వాములైన సంస్థలు, అధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఇండియన్ నేవీకి మరింత బలం చేకూరిందని నొక్కిచెప్పారు. ట్రయల్స్ సక్సెస్ కావడంతో త్వరలోనే ఈఆర్ఏఎస్ఆర్ వ్యవస్థను ఇండియన్ నేవీలో చేర్చనున్నారు.
కాగా, ఈఆర్ఏఎస్ఆర్ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీ సబ్‌మెరైన్ రాకెట్. ఇది జలాంతర్గాములను ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఇండియన్ నేవీకి చెందిన స్వదేశీ రాకెట్ లాంచర్‌ల నుంచి దీనిని ప్రయోగిస్తారు. ఈ రాకెట్ రెండు మోటార్లతో అమర్చబడి ఉండగా, ఇది వివిధ శ్రేణుల వద్ద ఉన్న శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), హైదరాబాద్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, నాగ్‌పూర్‌లు ఈఆర్ఏఎస్ఆర్ రాకెట్ల ఉత్పత్తిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి.






