- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Epfo: ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.25శాతం.. ఆమోదం తెలిపిన కేంద్రం
by B.Srinivas |
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై (EPFO) వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ బోర్డు వడ్డీ రేటును గతేడాది లాగే 8.25 శాతం వద్దనే కొనసాగించాలని సిఫార్సు చేసింది. తాజాగా ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో ఈ వడ్డీ మొత్తం దేశంలోని 7 కోట్లకు పైగా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ కానుంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం 2023-24 లోనూ ఇంతే శాతం వడ్డీ అమలు చేశారు. ఆ ఏడాది వడ్డీరేటును 8.15 శాతం నుంచి 8.25 శాతం పెంచారు. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎటువంటి మార్పూ చేయలేదు.
Next Story






