పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌

by Muthe.Rajitha |

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్ అయ్యారు.

పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ అరెస్ట్ అయ్యారు. పాలస్తీనా నిషేధిత సంస్థగా ప్రకటించిన ‘పాలస్తీన్‌ యాక్షన్‌’ ప్లకార్డును పట్టుకొని నిరసనకు దిగిన ను థన్‌బర్గ్‌ లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థను బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధం విధించింది. అయితే పాలస్తీనాకు అనుకూలంగా లండన్‌లో జరిగిన పలు నిరసనల్లో ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్టు చేయగా, కొందరికి బెయిల్‌ కూడా లభించక, అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు.

ఈ అరెస్టులకు వ్యతిరేకంగా పాలస్తీన్‌ యాక్షన్‌కు చెందిన కొంతమంది సభ్యులు లండన్‌ ప్రధాన వీధుల్లో నిరవధిక నిరసన చేపట్టి, ఇజ్రాయెల్‌ రక్షణశాఖతో సంబంధాలున్న ఓ బీమా సంస్థ కార్యాలయం సమీపంలో ఎరుపు రంగు పెయింట్‌ పోసారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ నిషేధిత సంస్థకు మద్దతుగా నిలిచినందుకుగాను గ్రెటాను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.

Next Story