- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
International Museum Day : ఈరోజు అన్ని ప్రదేశాల్లో ఎంట్రీ ఫ్రీ.. కారణం ఇదే!
ఈ రోజు మే 18న "అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం"(International Museum Day) సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,698 రక్షిత చారిత్రక కట్టడాలు(Historical Monuments), 52 మ్యూజియంలో(Museums) భారత పురాతత్వ సంస్థ(ASI) ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు మే 18న "అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం"(International Museum Day) సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,698 రక్షిత చారిత్రక కట్టడాలు(Historical Monuments), 52 మ్యూజియంలో(Museums) భారత పురాతత్వ సంస్థ(ASI) ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది. దీని లక్ష్యం ప్రజలను భారత సాంస్కృతిక, చారిత్రక వారసత్వంతో అనుసంధానం చేయడం, చరిత్ర పట్ల ఆసక్తిని పెంచడం అని తెలిపింది. ఇందులో తాజ్‌మహల్, లాల్ కిలా, కుతుబ్ మినార్, అజంతా-ఎల్లోరా గుహలు, సాంచీ స్తూపం, హంపీ, మహాబలిపురం వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి.
ఈ కట్టడాలు, మ్యూజియంలు సాధారణంగా ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 లేదా 6:00 వరకు తెరిచి ఉంటాయి. దీని ద్వారా సామాన్య ప్రజలు, విద్యార్థులు, పర్యాటకులు భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళాఖండాలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకునే అవకాశం పొందుతారని తెలిపింది. షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్, అశోక చక్రవర్తి 3వ శతాబ్దంలో నిర్మించిన సాంచీ స్తూపం, విజయనగర సామ్రాజ్య శిథిలాలతో కూడిన హంపీ, హిందూ, జైన, బౌద్ధ రాతి చెక్కడాలతో ఎల్లోరా గుహలు వంటివి ఉచితంగా సందర్శించవచ్చు.
ఈ ఉచిత ప్రవేశం వల్ల లక్షలాది మంది సందర్శకులు ఈ కట్టడాలను చూసే అవకాశం పొందుతారు. ఇది చారిత్రక స్థలాల పట్ల అవగాహనను పెంచడమే కాకుండా స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమీపంలోని చారిత్రక స్థలాలను సందర్శించి భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని మీరు కూడా వీక్షించండి.






