- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah: మార్చి 8 నుంచి అన్ని మార్గాల్లో స్వేచ్ఛాయుతంగా ప్రజల రాకపోకలు
మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణతో హింస చెలరేగింది. అల్లకల్లోలంగా మారిన మణిపూర్ లో (Manipur) రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయ

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణతో హింస చెలరేగింది. అల్లకల్లోలంగా మారిన మణిపూర్ లో (Manipur) రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే, అక్కడి భద్రతాపరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భేటీ తర్వాత కీలక ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే మార్చి 8నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అడ్డంకులు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. "మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి, ఈ విషయంలో అవసరమైన అన్ని రకాల సాయం అందించేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉంది" అని అమిత్ షా సమావేశంలో అన్నారు.
ఫెన్సింగ్ పనులు వేగవంతం చేయాలని..
సరిహద్దు భద్రతను పెంచడానికి మణిపూర్ లోని అంతర్జాతీయ సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయాలని అమిత్ షా నొక్కిచెప్పారు. ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులూ ఫెన్సింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మణిపూర్‌ను మాదకద్రవ్య రహితంగా మార్చడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాలని అన్నారు. కాగా.. రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లోని అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏడు రోజుల్లో దాదాపు 300 ఆయుధాలను ప్రజలు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశంలో మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు పాల్గొన్నారు. కాగా.. మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 13 నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 2027 వరకు పదవీకాలం ఉన్న అసెంబ్లీని కూడా కేంద్రం సస్పెండ్ చేసింది. కాగా.. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అక్కడి పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.






