Supreme Court: ఇనఫ్ ఈ జ్ ఇనఫ్.. ఇలాంటి వాటికి ముగింపు ఉండాలి- సుప్రీంకోర్టు

by Shamantha N |

ప్రార్థన స్థలాలకు సంబంధించిన కేసులో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Supreme Court: ఇనఫ్ ఈ జ్ ఇనఫ్.. ఇలాంటి వాటికి ముగింపు ఉండాలి- సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రార్థన స్థలాలకు సంబంధించిన కేసులో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ‘ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేసింది. అయితే, అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సుప్రీంకోర్టులో పిటిషన్లు

కాంగ్రెస్‌, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఆగస్టు 15, 1947న ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని మార్చడాన్ని నిరాకరిస్తూ 1991లో అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. అయితే, రామజన్మభూమి వివాదం దాని పరిధిలో లేదు. చట్టం చెల్లుబాటు గురించి న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, గతేడాది కోర్టు 10 మసీదులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ హిందూ పార్టీలు దాఖలు చేసిన 18 వ్యాజ్యాలపై విచారణను నిలిపివేసింది.

Next Story