బెయిర్ స్టో స్థానంలో మాథ్యూ షార్ట్

by Disha Web Desk 16 |
బెయిర్ స్టో స్థానంలో మాథ్యూ షార్ట్
X

న్యూఢిల్లీ : ఐపీఎల్-16‌కు పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్, ఇంగ్లాండ్‌కు చెందిన బెయిర్ స్టో దూరమయ్యాడు. గాయం కారణంగా అతను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని పంజాబ్ జట్టు శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. అతని స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్‌క్యాప్డ్ బ్యాటర్ మాథ్యూ షార్ట్‌ను జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో బెయిర్ స్టో ఎడమ కాలు ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను ప్రస్తుతం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో పాల్గొనడానికి అతనికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈసీబీ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ షార్ట్‌ బిగ్‌బాష్ 2022-23లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు తరఫున ఆడాడు. లీగ్‌లో సంచలన ప్రదర్శన చేసిన అతను 458 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అలాగే, 11 వికెట్లు కూడా తీశాడు. ఏప్రిల్ 1న జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టడం ద్వారా పంజాబ్ జట్టు లీగ్‌ను ప్రారంభించనుంది.


Next Story

Most Viewed