జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-15 04:03:33  IST  )

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir) మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అవంతిపొరా ( Awantipora) ప్రాంతంలోని నాడర్, థ్రాల్ గ్రామాల్లో గురువారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు (Encounter) చేపట్టారు. కాగా, ప్రధాని మోడీ (PM Modi ) స్పీచ్ తర్వాత వరుసగా ఇది రెండో ఎన్‌కౌంటర్‌ (Encounter).

కాగా, మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని షుక్రూ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబా (LeT)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల వివరాలను అధికారులు గుర్తించారు. ఒకరు షోపియన్ జిల్లా హీర్పోరా గ్రామానికి చెందిన షాహిద్ కుట్టే కాగా.. మరొకరు వాండూనా మెల్హోరా గ్రామానికి చెందిన అద్నాన్ షఫీ దార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, ఒక డ్రైవర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Next Story