Encounter: మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-02 07:07:42  IST  )

కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలకు మావోయిస్టులు లేఖ విడుదల చేసిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Encounter: మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలకు మావోయిస్టులు లేఖ విడుదల చేసిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం (Madhya Pradesh State)లోని మాండ్లా జిల్లా (Mandla District), బిచ్చియా (Bitchia) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిపై మావోయిస్టులు (Maoists) కాల్పులు జరుపగా.. ఇరుపక్షాల మధ్య సుమారు 4 గంటల పాటు ఎదురుకాల్పులు (Counter-Fire) కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కైలాశ్ మక్వానా (Kailash Makwana) వెల్లడించారు. ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిన స్థలంలో ఒక SLR రైఫిల్, ఒక సాధారణ రైఫిల్, భారీ వైర్‌లెస్ సెట్ (Huge Wireless Set), ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, మిగతా మావోయిస్టు దళ సభ్యలు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని డీజీపీ కైలాశ్ మక్వానా తెలిపారు.

Next Story