- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir)లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir)లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. సౌత్ కాశ్మీర్లోని గుదార్ అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో భద్రతాదళాలు ఉగ్రవాదులపై ప్రతికాల్పులు జరిపినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు (Kashmir Zone Police) వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా.. ఒక అధికారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలు అడవిని చుట్టుముట్టగా.. అక్కడ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.
Next Story






