Pahalagam Terror Attack : పహల్గాం ఉగ్రదాడికి మొదలైన రివేంజ్.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ

by Muthe.Rajitha |   (  Updated:2025-04-23 15:24:27  IST  )

జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgam) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపి 28 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న ఘటన మరవక ముందే... మరోసారి ముష్కరులు దాడులకు తెగబడ్డారు.

Pahalagam Terror Attack : పహల్గాం ఉగ్రదాడికి మొదలైన రివేంజ్.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgam) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపి 28 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరి పారేయడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం(Kulgam) జిల్లా తాంగ్ మార్గ్(ThangMarg) లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న బలగాలు అక్కడికి చేరుకున్నాయి. నిన్నటి ఘటనకు కారణమైన TRF కమాండర్‌ను భద్రతా బలగాలు ట్రాప్ చేసినట్టు సమాచారం.

పహల్గామ్‌ ఉగ్రదాడిలో నేరుగా పాల్గొన్న TRF నాయకుడు ఆసిఫ్‌ఫౌజీని బలగాలు చుట్టిముట్టునట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగగా.. ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం అయినట్టు బ్రిగేడియర్ అనిరుధ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Read Also..

Kashmir terror attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న కేరళ జడ్జిలు, ఎమ్మెల్యేలు


Next Story