బీజాపూర్ లో ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి

by Muthe.Rajitha |

మావోయిస్టు పార్టీ అగ్ర నేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

బీజాపూర్ లో ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీ అగ్ర నేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఘటనా స్థలంలో భారీ పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ లొంగుబాట్లు, ఎంకౌంటర్లతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు 2026 ఆగస్టు 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత భారత్ గా మార్చేందుకు ఆపరేషన్ కగర్ చేపట్టిన సంగతి తెలిసిందే.

Next Story