Encounter: బీజాపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-22 09:25:18  IST  )

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది.

Encounter: బీజాపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాతంలో ‘ఆపరేషన్ కగార్‌’‌లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతోన్న సీఆర్‌పీఎఫ్, డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతుండటంతో మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

కొనసాగుతోన్న పోస్ట్‌మార్టం ప్రక్రియ

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్‌మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను అధికారులు పోస్టు‌మార్టం కోసం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం అందులోను వర్షం పడుతుండటంతో డెడీబాడీలను సైనిక హెలికాప్టర్‌లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు నారాయణపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు‌మార్టం ప్రక్రియ కొనసాగుతోన్నట్లుగా తెలుస్తోంది. అయితే, బుధవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్, మావోయిస్టు పత్రిక అవామ్- ఇ- జంగ్ ఎడిటర్ సజ్జ వెంకటనాగేశ్వర రావు అలియాస్ నవీన్‌తో పాటు మొత్తం 27 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇవాళ వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Next Story