- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft : మైక్రోసాఫ్ట్ అధినేతలకు నిరసనల సెగ
మైక్రోసాఫ్ట్(Mycrosoft) తన 50వ వార్షికోత్సవ వేడుకలలో ఇబ్తిహాల్ అనే ఉద్యోగి తీవ్ర నిరసన(Employee Protest) తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : మైక్రోసాఫ్ట్(Microsoft) తన 50వ వార్షికోత్సవ వేడుకలలో ఇబ్తిహాల్ అనే ఉద్యోగి తీవ్ర నిరసన(Employee Protest) తెలిపింది. మైక్రోసాఫ్ట్ AI వాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వేడుకను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లో లోని ఓ లైవ్ ఈవెంట్ లో జరిగింది. మైక్రోసాఫ్ట్ AI CEO ముస్తఫా సులేమాన్ కంపెనీ యొక్క AI అసిస్టెంట్ "కోపైలట్"(CoPilot) గురించి వివరణ ఇస్తున్నప్పుడు ఉద్యోగి తన నిరసన తెలిపింది. "ముస్తఫా.. నీకు కాస్తైనా సిగ్గు ఉండాలి. నీవు AIని మంచి కోసం ఉపయోగిస్తామని చెప్పావు, కానీ మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి AI ఆయుధాలను అమ్ముతోంది. దానివల్ల 50,000 పాలస్తనీయులు మరణించారు. మైక్రోసాఫ్ట్ ఈ ఊచకోతకు మరింత ఆజ్యం పోస్తోంది. AIని ఊచకోత కోసం ఉపయోగించడం ఆపండి" అని డిమాండ్ చేసింది. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది వేదిక నుండి బయటకు తీసుకెళ్లారు. ఈ నిరసన ప్రో-పాలస్తీనియన్ ఉద్యమంలో భాగంగా జరిగింది.
ఈ ఉద్యమం మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి AI సాంకేతికతను సరఫరా చేస్తూ గాజాలో జరుగుతున్న సైనిక చర్యలకు సహకరిస్తోందని ఆరోపిస్తోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఈ సంఘర్షణలో మరణాల సంఖ్య 50,000 దాటినట్లు తెలిపింది. కాగా ఈ నిరసన జరుగుతున్నపుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates), మాజీ CEO స్టీవ్ బాల్మర్, ప్రస్తుత CEO సత్య నాదెళ్ల(Satya Nadella) కూడా ఉన్నారు. మరొక ఉద్యోగి, వనియా అగర్వాల్ కూడా నిరసన తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఈ సంఘటనపై స్పందిస్తూ, "మేము అన్ని గొంతులను వినేందుకు అవకాశాలను ఇస్తాము, కానీ వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించని విధంగా నిరసనలు ఉండాలని అని పేర్కొంది.ఈ నిరసన టెక్ పరిశ్రమలో AI సాంకేతికత యొక్క నైతిక ఉపయోగంపై చర్చను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా సైనిక కార్యకలాపాలలో దాని పాత్ర గురించి ఈ చర్చ మరింత తీవ్రతరం చేసింది.






