Employees fund: ఉద్యోగుల పీఎఫ్‌కు ప్రయివేట్ యజమానులు సహకరించట్లేదు.. పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక

by vinod kumar |
Employees fund: ఉద్యోగుల పీఎఫ్‌కు ప్రయివేట్ యజమానులు సహకరించట్లేదు.. పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయివేట్ సంస్థల యజమానులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సహకారం అందించకపోవడంపై పార్లమెంటరీ ప్యానెల్ (Parliamentary panel) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఈపీఎఫ్ఓతో సంప్రదించాలని తెలిపింది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లు 2025-26పై గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 146వ నివేదికలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ పరిశీలనను నమోదు చేసింది. ఈపీఎఫ్ఓ ​​పర్యవేక్షణలో ఉన్న ప్రయివేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఆ సంస్థల యజమానులు తమ వాటాను చెల్లించడం లేదని పేర్కొంది.

‘కొన్ని ప్రయివేట్ రంగ సంస్థలు ట్రస్టులను ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుల్లో తమ ఉద్యోగుల సహకారాన్ని జమ చేశాయి. కానీ ఈ డబ్బును ఎంప్లాయీస్‌కు చెల్లించరు. యజమాని వాటాను ఉద్యోగి ఈపీఎఫ్ఓ ​​ఖాతాకు జమ చేయరు. అటువంటి సందర్భంలో డిపార్ట్‌మెంట్‌కు ఏదైనా ఫిర్యాదు అందితే ఈపీఎఫ్ఓను సంప్రదించాలి’ అని తెలిపింది. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి డిపార్ట్‌మెంట్ ఆప్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ (DARPG) అనుసరించిన సంస్కరణల ప్రక్రియను కమిటీ ప్రశంసించింది. 2021లో 32 రోజుల సగటు పరిష్కార సమయాన్ని మే 2023 నాటికి 16 రోజులకు తగ్గించడం ప్రశంసనీయమని తెలిపింది. పరిష్కార రేటును మరింత మెరుగుపరచడానికి కృషి చేయాలని పేర్కొంది.



Next Story

Most Viewed