ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. హుటాహుటిన ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-09 05:54:39  IST  )

దేశంలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. హుటాహుటిన ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8.42కు పాట్నా (Patna) నుంచి ఢిల్లీ (Dehli)కి బయలుదేరిన ఇండిగో (Indigo) విమానాన్ని (6E509) టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్‌లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఫ్లైట్ క్రూతో పాటు మొత్తం 169 మంది ఉన్నట్లుగా సమాచారం. ఓ ఇంజిన్‌లో వైబ్రేషన్ కారణంగానే ఫ్లైట్‌ను తిరిగి పాట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా అప్రోచ్ కంట్రోల్ యూనిట్‌కు సమాచారం అందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఇండిగో సిబ్బంది ఆల్టర్‌నేట్ ఫ్లైట్‌ను సిద్ధం చేస్తున్నారు.

Next Story