అమెరికాలో నివాసంపై ఎంబసీ క్లారిటీ

by Muthe.Rajitha |

అమెరికాలో ఎంత కాల నివాసం ఉండాలో అనే విషయం పై ఆ దేశ ఎంబసీ కార్యాలయం స్పష్టత ఇచ్చింది.

అమెరికాలో నివాసంపై ఎంబసీ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో ఎంత కాల నివాసం ఉండాలో అనే విషయం పై ఆ దేశ ఎంబసీ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చో నిర్ణయించేది వీసా గడువు తేదీ కాదని, ఎంట్రీ సమయంలో CBP అధికారి I-94 ఫారంలో నమోదు చేసే “Admit Until Date” మాత్రమేనని తెలిపింది. వీసా ఎక్స్‌పైరీ డేట్ అనేది కేవలం అమెరికాలో ప్రవేశించడానికి చివరి తేదీ మాత్రమే, ఆ తేదీ వరకు ఉండొచ్చని అనుకోవడం తప్పు అని ఎంబసీ చెప్పింది. అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత మీకు ఎంతకాలం ఉండేందుకు అనుమతి ఇస్తారో అది I-94లో ఉంటుంది.

సాధారణంగా B1/B2 విజిటర్ వీసాలకు 6 నెలల వరకు ఇస్తారు. అయితే ఈ I-94 వివరాలను https://i94.cbp.dhs.gov వెబ్‌సైట్‌లో పాస్‌పోర్ట్ వివరాలు నమోదు చేసి చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఓవర్‌స్టే అయితే వీసా రద్దు, డిపోర్టేషన్, భవిష్యత్తులో వీసాలు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎంబసీ హెచ్చరించింది.

Next Story