అది ఉంటేనే మహిళలు : ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్

by Muthe.Rajitha |

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి నోరు జారాడు.

అది ఉంటేనే మహిళలు : ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి నోరు జారాడు. గర్భాశయం ఉన్నవాళ్లు మాత్రమే మహిళలు అని, గర్భాశయం లేనివాళ్ళు మహిళలు కారని సంచలన ట్వీట్ చేశారు. అయితే ఎలాన్ మస్క్ ముందునుంచి జెండర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండగా.. ఈసారి మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచంలో స్త్రీ పురుషులు అనే ఇద్దరు జెండర్స్ మాత్రమే ఉంటారని, థర్డ్ జెండర్ ఉండరని మస్క్ అంటూ ఉంటారు. ట్రాన్స్ జెండర్స్, క్వీర్ పీపుల్ పట్ల మస్క్ అనేకసార్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ విషయంలోనే మస్క్.. ట్రంప్ వైపు నిలబడ్డారు. కాగా మస్క్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story