Elon Musk: డోజ్ కీలక నిర్ణయం.. పలు దేశాల నిధులపై కటాఫ్

by Shamantha N |

అమెరికా (USA) ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Elon Musk: డోజ్ కీలక నిర్ణయం.. పలు దేశాల నిధులపై కటాఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA) ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు అమెరికా అందించే నిధుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లను రద్దు చేసినట్లు పేర్కొంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ బలోపేతం కోసం కన్సార్టియం నిధుల కోసం కేటాయించిన 486 మిలియన్ డాలర్ల బడ్జెట్ లో భాగమని హైలెట్ చేసింది.

బంగ్లా సహా పలుదేశాలకు షాక్..

మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తొలగింపులో US 'డీప్ స్టేట్' ప్రమేయం ఉందనే ఆరోపణల మధ్య బంగ్లాదేశ్ లో రాజకీయ గందరగోళం ఏర్పడింది. "బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత్వాన్ని మెరుగు పరిచేందుకు అందిస్తున్న మరో 29 మిలియన్ డాలర్లపైనా డోజ్ కోత విధించింది. ఆసియాలో మెరుగైన జీవనశైలి కోసం కేటాయిస్తున్న 47 మిలియన్ డాలర్లు, లింగసమానత్వం, మహిళాసాధికారత కోసం ఖర్చుచేసే 40 మిలియన్ డాలర్లపైనా కోత విదించింది ఇక నేపాల్‌, కంబోడియా, మాలి, సెర్బియా, దక్షిణాఫ్రికా, లైబీరియా వంటి పలు దేశాలకు కూడా వివిధ రూపాల్లో అమెరికా అందించే సాయాన్ని నిలిపివేశారు. మరోవైపు, అమెరికా డోజ్ విభాగం నిర్ణయంపై బీజేపీ (BJP) నేత అమిత్‌ మాల్వియా స్పందించారు. ‘ఓటర్లు సంఖ్య పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఎందుకు?. ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక్ష భాగం కాదు. దీని నుంచి ఎవరు లాభపడుతున్నారు?. అధికార పార్టీ మాత్రం కాదు’ అని మాల్వియా ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story