Elon Musk: ఏలియన్స్ కోసం ఎలన్ మస్క్ వేట

by S Gopi |

ఈ స్థావరంలో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, ఇతర అంతరిక్ష సాధనాలను నేరుగా చంద్రుడిపైనే తయారు చేయవచ్చు

Elon Musk: ఏలియన్స్ కోసం ఎలన్ మస్క్ వేట
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా మస్క్, చంద్రుడిపై 'మూన్‌బేస్ ఆల్ఫా' అనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తుందని, అక్కడ ప్రజలు నివశించవచ్చు, పనులు చేసుకోవచ్చని ఎలన్ మస్క్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్థావరంలో ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, ఇతర అంతరిక్ష సాధనాలను నేరుగా చంద్రుడిపైనే తయారు చేయవచ్చు. మానవులు అంతరిక్షంలో అన్వేషించేందుకు, అంగారక గ్రహానికి సిద్ధం కావడానికి, గ్రహంతరవాసులను అన్వేషించే వ్యోమనౌక నిర్మాణంతో పాటు, లాంచ్ చేయాలని మస్క్ ఆశిస్తున్నారు. ఈ మూన్‌బేస్ అంతరిక్షంలో దీర్ఘకాలంగా మానవ మనుగడకు కొనసాగుతున్న ప్రయత్నాలకు కీలక మెట్టుగా ఉంటుందని మస్క్ భావిస్తున్నారు. ఈ ప్రణాళికలో కీలకమైన భాగం మాస్ డ్రైవర్ అని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద విద్యుదయస్కాంత ట్రాక్. ఇది వస్తువులను అధిక వేగంతో ప్రయాణం చేసేందుకు ఉపయోగపడే పొడవైన విద్యుదయస్కాంత ట్రాక్. ఇది చంద్రుడిపై ఉండే తక్కువ గురుత్వాకర్షణ, గాలి లేకపోవడం వల్ల ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి వీలవుతుంది. సాధారణంగా భూమిపై ప్రయోగించడంతో పోలిస్తే చాలా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఎలన్ మస్క్ చంద్రుడిపై వస్తువులను తయారు చేసి, ఆపై వాటిని సమర్థవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలని, అదే సమయంలో చంద్రుడిని మానవులు నివసించగల, పని చేయగల ప్రదేశంగా మార్చాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

Next Story