- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elon Musk: భారత్ లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో పర్యటింనచున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో పర్యటింనచున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఎలాన్ మస్క్ ఫోన్ లో శుక్రవారం మాట్లాడారు. ఈ నేపథ్యంలో మస్క్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. ‘ప్రధాని మోడీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో భారత్ లో టెస్లా తన ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని లాంచ్ చేయనుంది. అందుకోసమే మస్క్ భారత్ రానున్నట్లు తెలుస్తోంది.
మస్క్ తో మోడీ ఫోన్ కాల్..
ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై ఇరువురు చర్చించారు. అంతేకాకుండా, ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. టారీఫ్‌ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతోన్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.






