ట్రంప్‌పై ట్వీట్ డిలీట్ చేసిన మస్క్.. గొడవ సద్దుమణిగినట్లేనా?

by Phanindra |   (  Updated:2025-06-07 15:32:36  IST  )

ట్రంప్‌పై ట్వీట్‌ను మస్క్ డిలీట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ట్రంప్‌పై ట్వీట్ డిలీట్ చేసిన మస్క్.. గొడవ సద్దుమణిగినట్లేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్ ఎలాన్ మస్క్, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మనస్పర్థలు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ షాకింట్ వ్యాఖ్యలు చేసిన మస్క్.. ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఈ ఇద్దరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షాకింగ్ కామెంట్స్ చేసిన మస్క్.. ట్రంప్ పేరు ఉండటం వల్లనే ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు మస్క్‌తో మాట్లాడాలని ట్రంప్‌కు సూచించగా.. ‘మస్క్ మతిపోయి మాట్లాడుతున్నాడని, అలాంటి వ్యక్తితో తను మాట్లాడనని’ అమెరికా అధ్యక్షుడు తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సడెన్‌గా ట్రంప్‌పై చేసిన ట్వీట్‌ను మస్క్ డిలీట్ చేయడంతో మళ్లీ ఈ ఇద్దరు ప్రముఖులు కలిసిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘ది అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు కూడా మస్క్ ఇటీవలే ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరి దీని భవితవ్యం ఏంటో చూడాలి.

Next Story