స్వేచ్ఛ కోసం.. అమెరికా పార్టీ.. ప్రస్తుత వ్యవస్థను ఓడిద్దాం: ఎలాన్ మస్క్

by Phanindra |

స్వేచ్ఛ కోసం అమెరికా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న వ్యవస్థను ఓడిద్దామని పిలుపునిచ్చారు.

స్వేచ్ఛ కోసం.. అమెరికా పార్టీ.. ప్రస్తుత వ్యవస్థను ఓడిద్దాం: ఎలాన్ మస్క్
X

దిశ, నేషనల్ బ్యూరో: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ట్రంప్ సంతకం పెట్టిన మరుసటి రోజే ‘అమెరికా పార్టీ’ ఏర్పాటు చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఈ బిల్లు విషయంలో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా పార్టీ ఏర్పాటైనట్లు ప్రకటించిన మస్క్.. ‘మీ స్వేచ్ఛను తిరిగివ్వడం కోసం అమెరికా పార్టీ ఏర్పాటైంది’ అని వెల్లడించారు.

ఇటీవలే కొత్త పార్టీ పెట్టాలా? వద్దా? అని మస్క్ పెట్టిన పోల్‌లో ప్రజలు కొత్త పార్టీ కావాలనే ఓటు వేశారు. ‘వృధా ఖర్చులతో దేశాన్ని దివాలీ తీయించే విషయంలో మనం ఒకే పార్టీ వ్యవస్థలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో కాదు. అందుకే ఈ పోల్‌లో 2/1 తేడాతో మీరు కోరుకున్నట్లే కొత్త పార్టీ మొదలవుతుంది. మీ స్వేచ్ఛను తిరిగి మీకివ్వడానికి అమెరికా పార్టీ ఏర్పాటైంది’ అని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. ‘కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను ఎంచుకొని, అక్కడే తీవ్రంగా కష్టపడి, ప్రస్తుతం ఉన్న ఒకపార్టీ వ్యవస్థను ఓడిద్దాం’ అని పేర్కొన్నారు.

Next Story