- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Election commission: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. కారణమిదే?
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్(EC)ల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme court) వాయిదా వేసింది. ఈ అంశంపై జస్టిస్ సూర్యకాంత్ (Surya kanth), ఎన్ కోటీశ్వర్ సింగ్ (Kotishwar singh)లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టాల్సి ఉండగా సమయాభావం కారణంగా పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపింది. హోళీ పండుగ విరామం తర్వాత ఈ కేసును విచారిస్తామని సూచించింది. అయితే స్పష్టమైన తేదీని వెల్లడించలేదు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన అంశమని, దీనిని వెంటనే పరిగణించాలని తెలిపారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ద్వారా సీఈసీ, ఈసీని నియమించాలనే 2023 నిర్ణయాన్ని అనుసరించాలా లేక సీజేఐని ప్యానెల్ నుంచి దూరంగా ఉంచే 2023 చట్టాన్ని అనుసరించాలా అని ప్రశ్నించారు.కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఈసీ, ఈసీల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.






