- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేజస్వీ యాదవ్‌కు ఈసీ నోటీసులు
బిహార్ డ్రాఫ్ట్ ఓటరు లిస్టు (Bihar Draft Voter List)లో తనపేరు కనిపించడం లేదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ డ్రాఫ్ట్ ఓటరు లిస్టు (Bihar Draft Voter List)లో తనపేరు కనిపించడం లేదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ ఆయన పాత ఈపీఐసీ నంబరుతో చెక్ చేసి ఉంటారని, ఆయన పేరు లిస్టులో ఉందని స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంపై ఈసీ మరోసారి స్పందించింది. ఆయనకు జారీ చేసిన కార్డు అధికారికంగా ఇచ్చింది కాదని, దానిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు తిరిగి ఆ కార్డును అప్పగించాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.
శనివారం (ఆగస్టు 2) మీడియాతో మాట్లాడుతూ ఆయన చూపించిన ఓటరు గుర్తింపు కార్డు అధికారికంగా చ్చింది కాదని, దానిని తిరిగి అప్పగించాలని ఎన్నికల అధికారులకు తేజస్వీకి లేఖ రాశారు. ఇదిలా ఉండగా తన ఓటరు కార్డు నంబర్ ను మార్చారని తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణల్ని జిల్లా కలెక్టర్ ఖండించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు జారీ చేసిన ఓటరు గుర్తింపు నంబర్ ఇదేనని, కార్డు నంబరు మారలేదని తెలిపారు.






