దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ.. ఎలక్షన్ వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఈసీ!

by Phanindra |

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. దీని కోసం ఇప్పటికే ఎలక్షన్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ.. ఎలక్షన్ వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఈసీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తన పోల్ మెషీనరీని ఈసీ యాక్టివేట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బిహార్‌లో తాజాగా ఓటర్ల జాబితా సవరణను (ఎస్ఐఆర్) ఈసీ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు.. అత్యున్నత న్యాయస్థానం కూడా ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగ బద్ధమేనని, అలాగే ఇది తప్పనిసరి ప్రక్రియ అని పేర్కొంది.

ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు చివరగా తమతమ రాష్ట్రాల్లో చివరగా ఎస్ఐఆర్ నిర్వహించినప్పటి ఓటర్ జాబితా వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో పబ్లిష్ చేయడం ప్రారంభించారు. బిహార్లో ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో జులై 28న మరోసారి విచారణ జరగనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేయడంపై ఈసీ ఒక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కొన్నిరోజుల క్రితమే దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కఠినమైన సమీక్ష నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది.

ఈ ఏడాది చివర్లో బిహార్ ఎన్నికలకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో కూడా త్వరలోనే ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఆగస్టు నుంచే ప్రారంభం అవ్వొచ్చని అంచనా.

Next Story