బీహార్ ఎన్నికలు: గంగా నది తీరంలో ఓటు హక్కుపై ఛఠ్ పూజ వేడుకల్లో వినూత్న ప్రచారం

by Ramesh Naini |

నార్త్ ఇండియాలో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ఛఠ్ ‌పూజ శనివారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

బీహార్ ఎన్నికలు: గంగా నది తీరంలో ఓటు హక్కుపై ఛఠ్ పూజ వేడుకల్లో వినూత్న ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నార్త్ ఇండియాలో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ఛఠ్ ‌పూజ శనివారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఛఠ్ పూజ (Chhath Puja) వేడుకల సందర్భంగా ఎన్నికల సంఘం (Election Commission) ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. పాట్నా జిల్లా పరిపాలన, బీహార్ ఎన్నికల కమిషన్ బృందం కలిసి వద్ద గంగా నది తీరంలోని ఛఠ్ ఘాట్‌ల వద్ద ప్రత్యేక పడవలో ప్రయాణిస్తూ ప్రజలను ఓటు వేయమని పిలుపునిచ్చారు.

గంగా నది ఒడ్డున పూజల్లో పాల్గొన్న భక్తులకు “ప్రతి ఓటు విలువైనది” అనే సందేశంతో సీఈఓ బీహార్ అధికారులు పడవతో ప్రత్యేక అవగాహన కల్పించారు. అలాగే ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘చిలుక’ బొమ్మ ప్రతీకగా రూపొందించిన ప్రత్యేక మాస్కాట్‌ను ఆవిష్కరించారు. ఈ ఎన్నికల పడవ అందరి దృష్టిని ఆకర్షించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వినూత్న ప్రచారం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వీడియో ఇదే..

Next Story