బీఎల్‌వోలపై ఒత్తిడి పెట్టొద్దు.. టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచన

by Phanindra |

బీఎల్‌వోలపై ఒత్తిడి పెట్టొద్దని టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎస్ఐఆర్‌పై అభ్యంతరాలుంటే డిసెంబరు 9 తర్వాత తెలపాలంది.

బీఎల్‌వోలపై ఒత్తిడి పెట్టొద్దు.. టీఎంసీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న వేళ.. బూత్ లెవెల్ అధికారులపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దని కేంద్ర ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. మరణించిన, ప్రాంతం మారిన, నకిలీ ఓట్లను గుర్తించే విషయంలో బీఎల్‌వోలపై ఏమాత్రం ఒత్తిడి పెట్టొద్దని కోరిన ఈసీఐ.. ఎస్ఐఆర్ విషయంలో టీఎంసీకి ఎలాంటి అభ్యంతరాలున్నా డిసెంబరు 9న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ అందించిన తర్వాత తెలియజేయాలని తెలిపింది. అప్పటి వరకు బీఎల్‌వోలు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌వోలు), డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ల (డీఈవోలు) పనుల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టంచేసింది. అలాగే వెస్ట్ బెంగాల్‌లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆఫీసులో ఇటీవలి కాలంలో పలుమార్లు సెక్యూరిటీ బ్రీచ్ జరగడంపై ఆందోళన వ్యక్తంచేసింది. మరింత భద్రత ఉండే ప్రాంతానికి ఈ ఆఫీసును తరలించాలని సూచించింది. ఇప్పుడున్న ఆఫీసు భవనంతోపాటు కొత్త భవనానికి కూడా సరైన రక్షణ ఇవ్వాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది.

Next Story