- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ఆస్ట్రేలియా కాల్పులు... షూటర్ ను అడ్డుకునేందుకు యత్నించిన వృద్ధ జంట.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా కాల్పులు... షూటర్ ను అడ్డుకునేందుకు యత్నించిన వృద్ధ జంట.. వీడియో వైరల్
by Muthe.Rajitha |
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. యూదుల హనుక్కా వేడుకను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడే ఉన్న బోరిస్, సోఫియా గుర్మన్ అనే వృద్ధ దంపతులు అసాధారణ సాహసం చేశారు. షూటర్ ను అడ్డుకునేందుకు అతని వద్ద నుంచి తుపాకీని లాక్కొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాది కింద పడిపోయినా, చివరకు అతడి నుంచి తప్పించుకోలేక ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదిని నిలువరించేందుకు చేసిన వారి ప్రయత్నం అందరినీ కదిలిస్తోంది. అయితే ఈ ఘటన అటుగా వెళ్తున్న కారు డాష్‌క్యామ్‌లో రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






