యూఎస్‌లో 8 మంది ఖలిస్తానీ టెర్రరిస్టులు అరెస్టు.. ఒకరు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్!

by Phanindra |

యూఎస్‌లో 8 మంది ఖలిస్తానీ టెర్రరిస్టులు అరెస్టయ్యారు. వీరిలో ఒకరు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.

యూఎస్‌లో 8 మంది ఖలిస్తానీ టెర్రరిస్టులు అరెస్టు.. ఒకరు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లో ఒక గ్యాంగ్ సంబంధిత కిడ్నాప్ కేసులో 8 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. వీరిలో ఒకరు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. శాన్ జోక్విన్ కౌంటీలో ఐదు చోట్ల ఒకేసారి తనిఖీలు చేపట్టిన ఎఫ్‌బీఐ బృందాలు ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పవిత్తర్ సింగ్ బాతాలా కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. భారత్‌లో నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) తరఫున ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేసులో పవిత్తర్‌పై కేసులున్నాయి. పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ అయిన అతన్ని ఈ ఉగ్రచర్యల కేసులో అరెస్టు చేయడానికి ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. అతన్ని తమ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా చేర్చింది.

Next Story