- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
America: అమెరికాలో ఆకాశన్నంటుతోన్న కోడి గుడ్ల ధరలు
బర్డ్ ఫ్లూ (Bird Flu) ఎఫెక్ట్‌తో మన దేశంలో ప్రజలు చికెన్, కోడి గుడ్లు (Eggs) తినాలంటే భయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బర్డ్ ఫ్లూ (Bird Flu) ఎఫెక్ట్‌తో మన దేశంలో ప్రజలు చికెన్, కోడి గుడ్లు (Eggs) తినాలంటే భయపడుతున్నారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా తగ్గి, ధరలు (Prices) సైతం పడిపోయాయి. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో (America) పరిస్థితి వేరేలా ఉంది. బర్డ్ ఫ్లూ కారణంగా కోడిగుడ్ల ధరలు ఆకాశన్నంటుతోన్నాయి. మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి కోడిగుడ్లను కూడా స్మగ్లింగ్ చేసేంత దారుణంగా అక్కడ పరిస్థితి నెలకొంది. 2023 ఆగస్టులో డజను గుడ్ల ధర 2.04 డాలర్లు (రూ.175) కాగా, ఈ ఏడాది మార్చిలో గరిష్ఠ స్థాయిలో 6.23 డాలర్ల (రూ.536)కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే డజను గుడ్ల ధర ఏకంగా 10 డాలర్లు (రూ.867) ఉంది.
గుడ్లలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. అందుకే అమెరికన్లు గుడ్లను ఆహారంగా ఎక్కువగా తీసుకుంటుంటారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే, బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఒక్కసారి గుడ్ల ఉత్పత్తి పడిపోవటంతో డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ కాస్త నెమ్మదించినా ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. ధరలు ఏప్రిల్ 20న ఈస్టర్ పండుగ వరకు పెరిగి, ఆ తర్వాత అదుపులోకి రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక బర్డ్ ఫ్లూ కారణంగా అమెరికాలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1.9 కోట్ల కోళ్లు చనిపోయాయి. అలాగే 16.80 కోట్ల కోళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. వీటిలో అత్యధికం కోళ్లు గుడ్ల కోసం పెంచేవే. చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు.






