- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలించని ప్రయత్నాలు.. బోరుబావికి మరో చిన్నారి బలి
వ్యవసాయ బోరుబావి (Borewell) మరో చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయ బోరుబావి (Borewell) మరో చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. దాదాపు 16 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీం ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan)లో చోటుచేసుకున్న ఘటన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఝలావర్ జిల్లాలోని పరాలియా గ్రామానికి చెందిన కలులాల్ బగారియా తన ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్‌ను తీసుకుని ఆదివారం పొలానికి వెళ్లాడు. అతడు పనులు చేసుకుంటుండగా అక్కడే బాలుడు ఆడుకుంటూ పొరపాటున 32 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. గమనించిన తండ్రి, స్థానికులు వెంటనే పోలీసులకు, రెస్య్కూ టీంకు సమాచారం అందించటంతో ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు. బాలుడికి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపారు. NDRF, SDRF బృందాలు 16 గంటల పాటు నిర్విరామంగా శ్రమించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. సోమవారం ఉదయం బాలుడిని బయటకు తీసినప్పటికే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, కొన్ని నెలల క్రితం రాజస్థాన్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. రెస్క్యూ టీం 10 రోజుల పాటు సహాయకచర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బయటకు తీసే సమయానికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.






