విషపూరిత వాయువుల ప్రభావం.. 16 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రి పాలు

by Malleboina Mahesh |

విషపూరిత వాయువులను పీల్చుకోవడం వల్ల 16 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ షాకింగ్ సంఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది.

విషపూరిత వాయువుల ప్రభావం.. 16 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రి పాలు
X

దిశ, వెబ్ డెస్క్: విషపూరిత వాయువులను పీల్చుకోవడం వల్ల 16 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ షాకింగ్ సంఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది. పారిశ్రామిక ప్రాంతం నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకోగా.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో వ్యాపించిన విషపూరిత వాయువులను పీల్చుకోవడంతో 16 మంది పిల్లలతో సహా 22 మందికి పైగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై నేలకూలిపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల నొప్పి, తల తిరగడం, ఛాతిలో నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు.

ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. విషవాయువు మూలం ఏమిటి? ఎలా లీక్ అయింది? అన్న అంశాలపై అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుల్లో పలువురు చిన్నపిల్లలు ఉండటంతో ఆందోళన మరింత పెరిగింది. పరిశ్రమ ప్రాంతంలో తక్షణమే అత్యవసర చర్యలు ప్రారంభించగా, కాలుష్య నియంత్రణ బృందాలు వాతావరణ నమూనాలను సేకరించి పరీక్షలు చేపట్టాయి. సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా ఎదురుచూస్తున్నాయి.

Next Story